కాఫీవిత్…ఆర్.రమాదేవి.1267- ఎ.రజాహుస్సేన్

రమాదేవి మార్క్ కవిత ఇది..ఒకరు ఇంకొకరికి ఊరకనే  నచ్చుతారా!యేంటి?
దానికీ కారణాలుంటాయి.‌ఈ కవితలో కథానాయికకు అతగాడు నచ్చడానికీ కారణాలున్నాయి….
ఆ వైనమేంటో తెలుసుకునే ముందు మీరూ …..ఓసారి ఈ కవిత చదవండి..!!“నువ్వెందుకు  నచ్చావంటే

ఏమో ...
నీపై
చుక్కలన్ని మెరుపులు అద్దాయేమో
పూలన్నీ పరిమళాలు వెదజల్లాయేమో
ఏమో నాకేం తెలుసు
ఏమో
ఎలా పోగు పడుతుందో మరి
రోజుకొక కొత్త కారణం
నిన్ను మరింత ప్రేమించడానికి
నువ్వొక
రంగుల ఆకాశమని
నా అరచేతిలో సముద్రమని
గుసగుసగా నా మది మరి మరి చెపుతోంది
ఏమో నిజంమెంతో నాకేం తెలుసు
ఓయ్
తెలియని పొడుపు కథలా
ఇంకా మిగిలే ఉంది
తెలిస్తే ... చెప్పరాదూ”!!
*ఆర్. రమాదేవి..!!

ఆమెకు…అతగాడు నచ్చేశాడు..నచ్చాడంటే అలా ఇలా కాదండోయ్!
పిచ్చ పిచ్చగా నచ్చేశాడు.అలా నచ్చడానికి కారణాలూ వున్నాయి..ఆ కారణాలే..
ఆమెకు నచ్చేలా చేశాయి…ఆ కారణాలు ఏమిటనేగా మీ అనుమానం…
మరింక ఆలస్యమెందుకు? తెలుసుకుందాం రండి.!

అతడెందుకు నచ్చాడంటే… నచ్చాడంటే.
అతడిపై చుక్కలన్ని మెరుపులు అద్దాయేమో ?
అందుకే తళతళమని మెరుస్తున్నాడు.
పూలన్నీ పరిమళాలు వెదజల్లాయేమో  గుబాళిస్తున్నాడు.
ఒకటా రెండా! అతడు నచ్చటానికి అనేక కారణా
లున్నాయి.రోజుకొక కొత్త కారణం ఎలా పోగు పడు
తుందో మరి..ఏ రోజుకారోజు ప్రత్యేకంగాకనబడతాడు…బహుశా అతగాడ్ని మరింతగా ప్రేమించడానికే
ఈ కారణాలు పుట్టుకొస్తున్నాయమో అంటారు….
రమాదేవి.!!
అతడొక రంగుల ఆకాశమని,ఆమె  అరచేతిలో సముద్రమని,గుసగుసగా ఆమె  మది మరి మరీ చెపుతోందిట.‌ఇందులో 
నిజమెంతో ఆమెకేం తెలుసు!!
అన్నట్టు….
తెలియని పొడుపు కథలా  ఆ నిజం ఇంకా మిగిలే ఉంది…
మీకేమైనా తెలిస్తే చెప్పరాదూ”అంటోందామె…!
ప్రేమించక పోవడానికి అనేక కారణాలుండొచ్చు.
కానీ ప్రేమించడానికి మాత్రం ఒక్క కారణం చాలు‌‌
అంతెందుకు? ప్రేమకు భూమిక ఆకర్షణకాదు‌..
అది ఖచ్చితంగా ప్రేమే అన్నది ఈ కవయిత్రి …
భావన..!!
*ఎ.రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!